ఈ ఫొటోను ఫ్రేమ్ కట్టించుకుని ఊరేగు: CM రేవంత్‌పై KTR సెన్సేషనల్ ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-21 13:02:46  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

ఈ ఫొటోను ఫ్రేమ్ కట్టించుకుని ఊరేగు: CM రేవంత్‌పై KTR సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వర్షాలు విస్తారంగా పడుతుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో యూరియా అవసరం పెరిగింది. దీంతో పలు జిల్లాల్లో ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్‌ల వద్ద రైతులు తెల్లవారింది మొదలు బారులు తీరుతున్నారు. పరిమితంగా యూరియా పంపిణీ చేస్తుండటంతో అన్నదాతల నుంచి సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (వేదికగా) ట్వీట్ చేశారు. రేవంత్.. నీ దరిద్రిపుగొట్టు పాలనకు దక్కిన అసమర్థ ఆస్కార్ అవార్డు ఇది అంటూ వనపర్తి జిల్లా ఆత్మకూరు పీఏసీఎస్ ఎదుట చెప్పుల క్యూలైన్ వద్ద ఓ రైతు పడుకున్న ఫొటోను షేర్ చేశారు.

ఆ ఫొటోను ఫ్రేమ్ కట్టించుకుంటావో.. మెడలో వేసుకుని ఊరేగుతావో నీ ఇష్టం అంటూ ఫైర్ అయ్యారు. అన్నదాతను ‘అప్పులపాలు’ చేసిన.. చేతకాని పాలకులను చూశాం కానీ.. ‘చెప్పులపాలు’ చేసిన చెత్త రికార్డు మాత్రం నీదేనని కామెంట్ చేశారు. బస్తా యూరియా కోసం.. రైతు బతుకును బజారున పడేశావంటూ ధ్వజమెత్తారు. అందరి కడుపునింపే అన్నదాతను.. పాదరక్షల పాల్జేసిన నీ పాపం ఊరికే పోదు. జై కిసాన్.. జై తెలంగాణ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story