- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలులో దారుణం.. గంజాయి మత్తులో యువకుడిపై కత్తులతో దాడి చేసిన నలుగురు మైనర్లు
చెన్నై నుంచి తిరుత్తణి వెళ్తున్న ఎలక్ట్రిక్ రైల్లో ప్రయాణిస్తున్న సూరజ్ (34) అనే యువకుడిపై నలుగురు మైనర్లు దాడికి పాల్పడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: చెన్నై నుంచి తిరుత్తణి వెళ్తున్న ఎలక్ట్రిక్ రైల్లో ప్రయాణిస్తున్న సూరజ్ (34) అనే యువకుడిపై నలుగురు మైనర్లు దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సూరజ్, తనను బెదిరిస్తున్న నిందితులను ప్రశ్నించినందుకు ఆగ్రహంతో ఊగిపోయిన వారు.. అతని మెడపై కత్తి పెట్టి భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా, చంపాలనే ఉద్దేశంతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితులను తిరువళ్లంగాడు సమీపంలోని హరిచంద్ర పురం వాసి నందగోపాల్ (17), అరక్కోణం కు చెందిన సంతోష్ (17), విక్కీ (17), తిరుత్తణి సమీపంలోని నెమిలికి చెందిన సంతోష్ (17)గా గుర్తించారు. విచారణలో వీరంతా గంజాయి మత్తులో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు వెల్లడైంది. నిందితులు సూరజ్‌ను కత్తితో బెదిరించి లొంగదీసుకోవాలని చూడగా, ఆయన ప్రతిఘటించడంతో ఈ కిరాతక దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని లోతైన విచారణ జరుపుతున్నారు.
- Tags
- marijuana






