గ్రేటర్ ​పరిధిలో నాలుగు ఇసుక బజార్లు

by Naga Rani Yarlagadda |

గ్రేటర్​హైదరాబాద్​ పరిసర ప్రాంతాల్లో వినియోగదారులకు ఇసుకను సులభంగా అందించేందుకు నాలుగు ఇసుక బజార్లు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పేర్కొంది.

గ్రేటర్ ​పరిధిలో నాలుగు ఇసుక బజార్లు
X
  • వినియోగదారులకు అందుబాటులో ధరలు
  • సన్న ఇసుక రూ. 1800, దొడ్డు ఇసుక రూ.1600
  • ప్రజలు ఈసేవలను ఉపయోగించుకోవాలి : టీజీ ఎండీసీ

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్​హైదరాబాద్​ పరిసర ప్రాంతాల్లో వినియోగదారులకు ఇసుకను సులభంగా అందించేందుకు నాలుగు ఇసుక బజార్లు ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పేర్కొంది. ఇసుక బజార్లలో సన్నని ఇసుక ధర రూ.1800, దొడ్దు ఇసుక రూ.1600లకు అమ్మకాలు చేస్తున్నట్లు తెలిపింది. రంగారెడ్డిలో వట్టి నాగులపల్లి, అబ్దుల్లాపూర్​మెట్, ఆదిభట్ట, మేడ్చల్​జిల్లాలోని భౌరంపేటలో బజార్ల లో ఇసుక​అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అన్ని ఇసుక బజార్లలో నాణ్యమైన నదీ ఇసుక సరిపడా నిల్వలో ఉందని, వ్యక్తిగత వినియోగదారులు, కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థల అవసరాలను తీర్చగలిగే విధంగా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. వినియోగదారులు టి.జి.ఎం.డి.సి సాండ్ సేల్ మేనేజ్‌మెంట్, మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్‌లో ఇసుకను బుక్ చేసుకోవచ్చు. “https://sand.telangana.gov.in/TGSandBazaarPortal/Masters/Home.aspx” మరింత సమాచారం కోసం సందేహాల నివృత్తికి టి.జి.ఎం.డి.సి హెల్ప్‌లైన్ నంబర్ 155242 ను సంప్రదించగలరు. అంతేకాకుండా [email protected]’ కి ఈ-మెయిల్ చేయవచ్చని సంస్థ తెలిపింది. గ్రేటర్​నగర పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సేవను వినియోగించుకోవాలని కోరింది.

Next Story