తెలంగాణ షాకింగ్ ఘటన.. మాజీ ఎమ్మెల్యే తల్లి మిస్సింగ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-18 14:00:00  IST  )

తెలంగాణ(Telangana)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా బీఆర్ఎస్(BRS) అధ్యక్షుడు, పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు(Kantha Rao Rega) తల్లి అదృశ్యమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ షాకింగ్ ఘటన.. మాజీ ఎమ్మెల్యే తల్లి మిస్సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా బీఆర్ఎస్(BRS) అధ్యక్షుడు, పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు(Kantha Rao Rega) తల్లి అదృశ్యమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 03:30 గంటల సమయంలో కరకగూడెంలోని ఆయన నివాసంలో నుంచి కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా రేగా కాంతారావే సోషల్ మీడియా(Whatsapp) ద్వారా తన బంధువులు, పార్టీ శ్రేణులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. తన తల్లికి మతిస్థిమితం లేదని.. దయచేసి ఎక్కడైనా కనపిస్తే చెప్పాలని స్థానిక ప్రజలను వేడుకున్నారు. తల్లి పేరు నర్సమ్మగా చెప్పారు.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో రేగా కాంతారావు పినపాక నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్ నేత పాయం వెంకటేశ్వర్లు(Payam Venkateswarlu) చేతిలో ఓటమి చెందారు.

నోట్: అదృశ్యమైన 3 గంటల తర్వాత తల్లి ఆచూకి తెలిసినట్లు సమాచారం.





Next Story