- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెప్టెంబర్ 17 విమోచనం కాదు.. బరాబర్ విలీనమే: బీజేపీ నేతలపై వీహెచ్ ఫైర్
స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకు బీజేపీ(Telangana BJP) కొత్త రాగం ఎత్తుకున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు(V.Hanumantha Rao) తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకు బీజేపీ(Telangana BJP) కొత్త రాగం ఎత్తుకున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు(V.Hanumantha Rao) తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 17 గురించి మాట్లాడే అర్హత బీజేపీకి ఏమాత్రం లేదని అన్నారు. సెప్టెంబర్ 17 విమోచనం కాదు.. బరాబర్ విలీనమే అని స్పష్టం చేశారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం బీజేపీ నేతలకు అలవాటే అని విమర్శించారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడం వారికి పరిపాటిగా మారిందని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా తెలంగాణ ప్రజలు అమయకులు కాదు.. చైతన్యవంతులు అని చెప్పారు. ఇదిలా ఉంటే.. కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఈనెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు నిర్వహించేందుకు తెలంగాణ బీజేపీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ వేడుకలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్(Bandi Sanjay), మహారాష్ట్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ నాయకులు హాజరుకానున్నారు. అంతేకాదు.. పరేడ్ గ్రౌండ్ సమీపంలోని కంటోన్మెంట్ పార్కులో దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.






