తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. మాజీ MP మందా జగన్నాథం కన్నుమూత

by Gantepaka Srikanth |

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాగర్‌‌కర్నూలు(Nagarkurnool) మాజీ ఎంపీ మందా జగన్నాథం(Manda Jagannadham) కన్నుమూశారు.

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. మాజీ MP మందా జగన్నాథం కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాగర్‌‌కర్నూలు(Nagarkurnool) మాజీ ఎంపీ మందా జగన్నాథం(Manda Jagannadham) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)లో చేరి చికిత్స తీసుకున్నారు. ఆదివారం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తల తెలిసిన సన్నిహితులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 1951, మే 22న నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఇటిక్యాలలో మంద జగన్నాథం జన్మించాడు. ఆయన తండ్రి పెద్ద పుల్లయ్య. జగన్నాథం వైద్య విద్యలో ఎంఎస్ పూర్తి చేశాడు. తెలుగుదేశం తరపున ఎంపీగా గెలవడంతో పాటు.. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తరువాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Next Story