2017కు ముందు నుంచే ట్యాపింగ్.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |

ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన బీఆర్ఎస్‌ను డిజాల్వ్ చేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

2017కు ముందు నుంచే ట్యాపింగ్.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన బీఆర్ఎస్‌ను డిజాల్వ్ చేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి కుటుంబ పార్టీలు ఉండకూడదని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ తో శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒకే కుటుంబం నుంచి ఐదారుగురు పాలించిన ఘటన తెలంగాణలోనే జరిగిందని ఆయన పేర్కొన్నారు. 2017 కంటే ముందు నుంచే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన తెలిపారు. 2018లో బీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతో ఎంతో మందిని హింసించారని కొండా తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా బాధితుడేనని ఆయన వెల్లడించారు. ఈ కేసులో నిందితులను శిక్షంచకపోతే బీఆర్ఎస్, కాంగ్రెస్ కు మధ్య ఒప్పందం ఉందని ప్రజలకు అర్థమవుతుందన్నారు. బీఆర్ఎస్.. వ్యాపారులను హింసించి డబ్బు వసూలు చేసిందని విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్‌తో పాటు ఇతర చట్టాల కేసు నమోదుచేయాలని కొండా డిమాండ్ చేశారు. గతంలో తమపై బురదజల్లారని, ఇప్పుడు ప్రజలు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పై చర్యలు తీసుకోకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

Next Story