కేటీఆర్ బర్త్ డే.. విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసిన మాజీ ఎంపీ

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పుట్టినరోజును పుర‌స్క‌రించుకొని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్(MP Santhosh kumar) విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసారు.

కేటీఆర్ బర్త్ డే.. విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసిన మాజీ ఎంపీ
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పుట్టినరోజును పుర‌స్క‌రించుకొని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్(MP Santhosh kumar) విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసారు. సామాజిక సేవ‌లో భాగంగా గిఫ్ట్ ఏ స్మైల్(Gift A Smile) కార్య‌క్ర‌మంలో భాగంగా బోయిగూడ‌లోని సెయింట్ ఫిలోమెనాస్ విద్యార్థుల‌కు 100 బెంచీలు, అదేవిధంగా 6వ త‌ర‌గ‌తి నుంచి 10 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువులో మొద‌టి రెండు స్థానాల్లో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన‌ విద్యార్ధినీ విద్యార్థుల‌కు 20 సైకిళ్లను పంపిణీ చేసారు.

అనంత‌రం కేక్ క‌ట్ చేసి కేటీఆర్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్, తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మ‌న్ మేడే రాజీవ్ సాగ‌ర్, స‌న‌త్ న‌గ‌ర్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ లు తదితరులు పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు.

Next Story