ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు: మాజీ ఎమ్మెల్యే అభ్యంతరం

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌కు ‘బండారి రాజిరెడ్డి కారిడార్‌’గా నామకరణం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు: మాజీ ఎమ్మెల్యే అభ్యంతరం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌కు ‘బండారి రాజిరెడ్డి కారిడార్‌’గా నామకరణం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప్పల్ నియోజకవర్గానికి బండారి రాజిరెడ్డి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఈ పేరును మార్చినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానిక బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తప్పుబట్టారు.

‘నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌కు శంకుస్థాపన చేశాం. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేసిన కారిడార్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధం లేని వ్యక్తుల పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యూ‌లర్‌ను వెంటనే ఉపసహరించుకోవాలి. ఈ ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌కు భారత మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టాల’ అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story