- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్‌లో హాట్‌టాపిక్‌గా కవిత వ్యవహారం.. నెక్ట్స్ సీఎం ఎవరో తేల్చి చెప్పిన మాజీ మంత్రి
బీఆర్ఎస్(BRS) మహిళా నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) వ్యాఖ్యలపై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) పరోక్షంగా ఖండించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) మహిళా నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) వ్యాఖ్యలపై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) పరోక్షంగా ఖండించారు. శుక్రవారం ఉదయం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. బీఆర్ఎస్ అంతర్గత పోరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో విలీనం కాదు కదా.. కనీసం పొత్తు కూడా ఉండబోదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ మాత్రమే అని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని.. మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలనను చూస్తున్న రాష్ట్ర ప్రజలంతా.. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఏ పార్టీలో అయినా చిన్న చిన్న సమస్యలు కామన్.. అన్ని త్వరలోనే సర్దుమణుగుతాయ్ అని చెప్పారు.
మరోవైపు గురువారం మీడియాతో చిట్‌చాట్ చేసిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను గంపగుత్తగా బీజేపీకి అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే తాను వ్యతిరేకించానని చెప్పారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్ మాత్రమే నాకు నాయకుడు.. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాను. వెన్నుపోటు పొడవడం నా లక్షణం కాదు.. నేరుగానే పోరాడతాను. కొత్త పార్టీ అవసరం లేదు.. ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలు. లేఖలో నేను చేసిన సూచనల్లో ఒక్కటైనా తప్పుందా? కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లు అయ్యారా? కడుపులో విషం పెట్టుకుని బయటకు నవ్వుతూ ఉండలేను. నా తండ్రికి వందల లేఖలు రాశాను.. తప్పేంటి? సాధారణంగా కేసీఆర్ లేఖను చదివాక చింపుతారు. ఈసారి అలా చింపలేదు. కుట్ర ఎవరు చేశారో నాకు తెలియదు... బయటపెట్టాలని అంటున్నాను. లీకు వీరుడా.. లీకు వీరులా? అనేది తెలియాలని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.






