Prashanth Reddy: న్యాయస్థానాలపై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం

by Gantepaka Srikanth |

కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Prashanth Reddy: న్యాయస్థానాలపై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపట రాజకీయాలు చేస్తూ న్యాయస్థానాల పై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్‌ల అంశంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి తమ చిత్తశుద్ధి లేదని బయటపెట్టుకుందని పేర్కొన్నారు. తెలివిగా డ్రామాలాడుతున్నదని.. తాము పెంచాలనుకున్నాం కానీ కోర్టు అడ్డుపడిందని న్యాయస్థానంపై నెపం వేస్తూ బీసీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నదని ఆరోపించారు. చెల్లదని తెలిసినా, రిజర్వేషన్ పెంపు జీఓ జారీ చేశారని.. అనంతరం మళ్లీ పార్టీ అనుచరులతోనే కోర్టులో కేసు వేయించి ఆ నిర్ణయాన్ని అడ్డుకోవాలనే కుట్ర చేశారని పేర్కొన్నారు. ఈ ద్వంద్వ నాటకం ఎవరి కోసం? ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి ఈ డ్రామాలు ఆడుతున్నావ్ రేవంత్‌రెడ్డి? అని నిలదీశారు. రాజ్యాంగ సవరణ కోసం 22 నెలలుగా ఢిల్లీలో పోరాటం చేయకుండా కాంగ్రెస్ గల్లీలో మాత్రం డ్రామాలు ఆడుతున్నదని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్‌ల పెంపు కోసం ఢిల్లీలో కాంగ్రెస్ నిజాయతీగా పోరాటం చేస్తే, తాము కూడా కలిసి వస్తామని.. కానీ ప్రజలను మోసం చేసే కపట రాజకీయాలకు తాము సహకరించమని వెల్లడించారు.

Next Story