‘ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’.. సర్కార్‌కు మాజీ మంత్రి హెచ్చరిక

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ పార్టీకి, రేవంత్​రెడ్డి ప్రభుత్వానికి బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదని, హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైందని మాజీ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

‘ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’.. సర్కార్‌కు మాజీ మంత్రి హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి, రేవంత్​రెడ్డి ప్రభుత్వానికి బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదని, హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైందని మాజీ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా పోయిందని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మభ్యపెట్టారని చూశారని, బీసీలు వాస్తవాలను తెలుసుకున్నారని తెలిపారు.

బీసీల రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణమని చెల్లని జీవోలను, ఆర్డినెన్సులను విడుదల చేశారని బీసీల సమస్యలు పరిష్కరించే నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయని, కామారెడ్డి డిక్లరేషన్ బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ పాల్గొంటున్నాయని, మొక్కుబడిగా బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ భాగస్వామ్యం కావద్దని, బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారానే 42 శాతం రిజర్వేషన్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీసీలకు ఒక్క శాతం రిజర్వేషన్ తగ్గవద్దని హెచ్చరించారు.

Next Story