- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్‌తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణలో పదేళ్ల పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ పాలన సాగిందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను తక్కువ చేసి చూపించాలనే ప్రయత్నం సరికాదని చురుకలంటించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్ అధ్వర్యంలో తెలంగాణ దశాబ్ధి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
Next Story






