రైతులు ఎవరూ ఆ పని చేయకండి.. మాజీ మంత్రి కేటీఆర్ కీలక సూచన

by Disha Web Desk 19 |
రైతులు ఎవరూ ఆ పని చేయకండి.. మాజీ మంత్రి కేటీఆర్ కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. కేటీఆర్ గురువారం ఆయన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. మీకు మేము, కేసీఆర్ ఉన్నారని ధైర్యం చెప్పారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని మండిపడ్డారు. గతేడాది ఇదే సమయానికి కాళేశ్వరం ద్వారా రైతులకు నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు.

కేసీఆర్‌పై కోపంతో ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లను రిపేర్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు లేక, అకాల వర్షాలకు పంట నష్ట పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. సీఎం రేవంత్ రెడ్డికి రైతులను పరామర్శించే సమయం లేదని విమర్శించారు. రైతు బంధు స్కీమ్ కోసం ఎన్నికలకు ముందు కేసీఆర్ రూ.7 వేల కోట్లు పెట్టిపోతే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చిందని ఆరోపించారు. నీళ్లు లేక, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed