- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: ఒక్కరోజులో సమగ్ర కుటుంబ సర్వే చేశాం
బీఆర్ఎస్(BRS) హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కౌంటర్ ఇచ్చారు. మంగళవారం అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వే చేసింది అధికారులే అని చెప్పారు. అప్పుడున్న అధికారులే ఇప్పుడు కూడా సర్వే చేశారని అన్నారు. తాము చేసిన సర్వేలో 3 కోట్ల 68 లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు. ఒక్కరోజులో సమగ్రంగా సర్వే చేశామని వెల్లడించారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 51 శాతంగా ఉందని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో ముస్లింలను కలుపుకుని బీసీలు 61 శాతం అని కేటీఆర్ స్పష్టం చేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కులగణన సర్వేపై కొందరు కావాలనే వ్యూహాత్మకంగా అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు.
కేసీఆర్(KCR) ప్రభుత్వం 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు చట్టబద్ధత లేదని.. ఆ వివరాలు ఎందుకు వెల్లడించలేదు అని ప్రశ్నించారు. కేసీఆర్ సర్వేలో బీసీలు 51 శాతం, ఓసీలు 21 శాతంగా చూపించాయని అన్నారు. తాము బీసీలు 56 శాతం, ఓసీలు 13 శాతం అని చెప్పాం. కానీ మేము బీసీల జనాభా తగ్గించి.. ఓసీల జనాభా పెంచామని అబద్దాలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రతీ పదేళ్లకు జనాభా లెక్కల్లో ఎస్సీలు, ఎస్టీల లెక్కలను మాత్రమే తీసుకుంటున్నారని.. బీసీల సమాచారం ఉండటం లేదన్నారు. బలహీన వర్గాల వారికి విద్య, ఉద్యోగాల్లో సముచిత స్థానం ఇవ్వడానికే రాహుల్ గాంధీ(Rahul Gandhi) సూచనలతో తెలంగాణలో కులగణన చేపట్టామని తెలిపారు. కులగణన సమగ్ర సర్వేలో పాల్గొనని వారికి ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా..? అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నేత సమావేశాలకు రాడు.. సర్వేలో పాల్గొనడు అని కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.






