ఎగ్జిట్ పోల్స్‌లో బీఆర్ఎస్‌కు జీరో సీట్స్.. కేటీఆర్ రియాక్షన్ ఇదే..!

by Satheesh |

ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేకుండా ఎగ్జాట్ పోల్స్ వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అమరజ్యోతి వద్ద

ఎగ్జిట్ పోల్స్‌లో బీఆర్ఎస్‌కు జీరో సీట్స్.. కేటీఆర్ రియాక్షన్ ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేకుండా ఎగ్జాట్ పోల్స్ వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అమరజ్యోతి వద్ద అమరులకు నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జీవితంలో ఒక్కసారి జై తెలంగాణ అనని వ్యక్తి, అమరులకు నమస్కరించని, నివాళులర్పించని వ్యక్తి సీఎంగా ఉండటం దురదృష్టకరం అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వారే ప్రభుత్వాన్ని నడుపుతారన్నారు. దురదృష్టం ఏమిటంటే తెలంగాణ చరిత్ర పోరాటాన్ని, పౌరుషాన్ని, అమరుల త్యాగాన్ని అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలోని ప్రతి వర్గాన్ని విస్మరిస్తుందని ఆరోపించారు. తెలంగాణ అమరులను చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, ఉద్యమకారులను చంపిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. అందుకే దశాబ్ది ఉత్సవాలకు ఇచ్చిన ఆహ్వానాన్ని బహిష్కరిస్తున్నామని, ఎవరూ పాల్గొనడం లేదన్నారు. మూడురోజుల పాటు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ముగింపు ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి వర్గంను భాగస్వాములను చూసి ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. 1952 నుంచి 2014 వరకు అమరులైన వారిని స్మరించుకొని నివాళులర్పించడం జరిగిందని తెలిపారు.

Next Story