- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jagadish Reddy: కేసీఆర్ ఆరోగ్యంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి క్లారిటీ..
తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29కు ఉన్న ప్రాధాన్యతను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి శనివారం సోషల్ మీడియాలో గుర్తు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29కు ఉన్న ప్రాధాన్యతను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి శనివారం సోషల్ మీడియాలో గుర్తు చేశారు. అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మలుపు తిప్పిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన దీక్ష 11 రోజుల పాటు కొనసాగుతుండగా తెలంగాణ ప్రజలు ఆందోళనలో గడిపారని, రాష్ట్ర భవిష్యత్తుపై ఆ సమయంలో తీవ్ర ఆతృత నెలకొన్నదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించేందుకు కూడా వెనుకాడని నాయకుడు కేసీఆర్ అని, ఆయన పట్టుదలే ఢిల్లీ నాయకత్వాన్ని రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకునేలా చేసిందని పేర్కొన్నారు.
ఉద్యమ సమయంలో ఎదురైన పరిస్థితులను ప్రస్తావించిన ఆయన, హైదరాబాద్ లేకుండా తెలంగాణను ప్రకటిస్తామన్న కేంద్రంలోని అప్పటి ప్రతిపాదనను కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు గౌరవప్రదమైన రాష్ట్ర హోదా సాధించినందుకు కారణమని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌పై విమర్శలు చేయడం అనుచితమని, కేసీఆర్ పాలనలో ఏర్పడిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఆయన విమర్శించారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, తాగునీరు, వ్యవసాయ అభివృద్ధి, రాష్ట్ర ఆదాయం పెరుగుదల కేసీఆర్ పాలన ఫలితమని అన్నారు.
ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారం కూడా ‘అబద్ధమని’ జగదీష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావడం ఖాయమని, తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ నాయకత్వంలోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం “లాఠీ పాలన, లూటీ పాలన” నడుపుతోందని ఆరోపించిన ఆయన, తెలంగాణ కాంగ్రెస్ నుంచి విముక్తి కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ట్వీట్ ఇదే..






