- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్లక్ష్యానికి మరో స్పష్టమైన నిదర్శనం.. కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన హరీశ్‌రావు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27 తెలంగాణపై కొనసాగుతున్న నిర్లక్ష్యానికి మరో స్పష్టమైన నిదర్శనం అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27 తెలంగాణపై కొనసాగుతున్న నిర్లక్ష్యానికి మరో స్పష్టమైన నిదర్శనం అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్‌లోనూ న్యాయం జరగకపోవడం శోచనీయం అని తెలిపారు. ఏళ్లు గడుస్తున్నాయి, బడ్జెట్లు మారుతున్నాయి తప్ప, తెలంగాణకు నిధుల కేటాయింపులో చూపుతున్న కేంద్రం వివక్షలో ఎలాంటి మార్పు లేదన్నారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా విభజన చట్టం హామీలు అమలు చేయడంలో కేంద్రం దారుణంగా విఫలమైందని ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రైల్వే ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు లేకపోవడం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం అని తెలిపారు. తెలంగాణకు ఐఐఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఊసు లేదు. ఒక్క ప్రాజెక్టుకు ఆర్థిక సాయం లేదన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న స్పష్టమైన ఆర్థిక అన్యాయం ఇది అని, తెలంగాణ నుంచి BJPకి 8 మంది, Congressకి 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదని విమర్శించారు. పార్లమెంట్‌లో తెలంగాణ గొంతు వినిపించడంలో కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా, బడ్జెట్ లో తెలంగాణకు నిధులు రాబట్టలేక పోవడం సిగ్గుచేటని విమర్శించారు.
60కి పైగా సార్లు ఢిల్లీ వెళ్లినా...
కేంద్ర క్యాబినెట్‌లో ఉండి కూడా నిధులు తీసుకురాలేకపోవడం వారి అసమర్థతను చూపుతోందని హరీశ్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 60కిపైగా సార్లు ఢిల్లీ వెళ్లినా, వాటి ఫలితం మాత్రం శూన్యం అని అన్నారు. డిల్లీ పర్యటనలు రాజకీయ ప్రదర్శనలకే పరిమితమయ్యాయి తప్ప, తెలంగాణకు ఎలాంటి లాభం లేదని సీఎంపై మండిపడ్డారు. తన రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టడం వల్లే బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు కనీస ప్రాధాన్యం లేకుండా పోయిందని, కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలతో తెలంగాణకు జరిగేది నష్టమే తప్ప లాభం కాదని మరోసారి స్పష్టం అయ్యిందన్నారు. మొత్తంగా... ‘కేంద్ర అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ పూర్తిగా anti-Telangana, anti-farmer, anti-people అని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాలకు ఈ బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం లేదు.. Futures & Optionsపై STT పెంపు మార్కెట్ విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య.. రాష్ట్రాలకు రావాల్సిన పన్ను వాటాను క్రమంగా తగ్గిస్తూ ఆర్థిక సమాఖ్య (Fiscal Federalism) స్ఫూర్తిని తీవ్రంగా దెబ్బతీశారు.. కేంద్రం మాటల్లో సహకార సమాఖ్య (Cooperative Federalism) అంటూ ఆచరణలో రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం ప్రజాస్వామ్య విరుద్ధం.. మధ్యతరగతి ప్రజలను పన్ను ఊరట లేదు, ద్రవ్యోల్బణ భారం పట్టించుకోలేదు, ఉద్యోగ కల్పన కాగితాలకే తప్ప వాస్తవ రూపం దాల్చడం లేదు. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లయిన నిరుద్యోగం, తయారీ రంగం పతనం, రైతుల సంక్షోభం గురించి బడ్జెట్‌లో కనీస ప్రస్తావన లేదు. దేశ భవిష్యత్తుపై ఎటువంటి స్పష్టత లేని బడ్జెట్ ఇది. బడ్జెట్ అనంతరం స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగియటం తీవ్ర నిరాశకు నిదర్శనం’ అని అన్నారు.
కేసీఆర్ అభివృద్ధి మోడల్‌ను చాటి చెప్పిన 16 వ ఆర్థిక సంఘం
ఈ పరిస్థితుల్లోనూ తెలంగాణ అభివృద్ధి సాధించిందంటే, అది కేసీఆర్ పదేళ్ల ప్రభుత్వ సమర్థవంతమైన ఆర్థిక పాలన ఫలితం అని ఆర్థిక సంఘం స్పష్టం చేసిందన్నారు. తెలంగాణ own tax revenue 2023-24 నాటికి దేశంలోనే 80% చేరింది. ఇది దేశంలోనే అత్యధికం.. అన్నారు. కేంద్ర నిధులపై అత్యల్ప ఆధారపడే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. 2023-24 నాటికి Capital Expenditure విషయంలో తెలంగాణ దేశంలో Top 4 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో రైతు బంధు వంటి చారిత్రక పథకాలు తెలంగాణలోనే అమలయ్యాయని అన్నారు. 2023-24 నాటికే, రూ. 19,681 కోట్లతో దేశంలోనే అత్యధిక వ్యవసాయ సబ్సిడీ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని రుజువైందన్నారు. కేసీఆర్ ప్రారంభించిన మిషన్ కాకతీయ అమృత్ సరోవర్ గా దేశానికి రోల్ మాడల్ అయ్యిందన్నారు. బడ్జెట్ లో చెప్పిన “500 reservoirs and Amrit Sarovars development” ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోందని అన్నారు. తెలంగాణ ఆచరిస్తే.. దేశం అనుసరిస్తున్నదన్న విషయం మరోసారి రుజువైందని హరీశ్ రావు తెలిపారు.






