మాజీ మావోయిస్టు, సామాజిక కార్యకర్త గాదె ఇన్నారెడ్డి అరెస్ట్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-21 08:52:08  IST  )

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జాఫర్గఢ్‌లోని తన ఇంటివద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మాజీ మావోయిస్టు, సామాజిక కార్యకర్త గాదె ఇన్నారెడ్డి అరెస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జాఫర్గఢ్‌లోని తన ఇంటివద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ నుండి ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడనే ఆరోపణలతో ఇన్నారెడ్డిపై UAPA చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్‌లో ఇటీవల మరణించిన సీపీఐ మావోయిస్టు సీపీఎం కేడర్ అయిన కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియల్లో గాదె ఇన్నారెడ్డి అక్కడి సమూహాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. నిషేదిత మావోయిస్ట్ పార్టీకి మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇన్నారెడ్డి ఎక్కువగా టీవీ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ రాజకీయ, సమాజిక అంశాలపై విశ్లేషణలు చేస్తారు. మాజీ మావోయిస్టు కావడంతో ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో మావోయిస్టులకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర అంటూ ఆరోపణలు చేశారు.





Next Story