Kaleshwaram : కాళేశ్వరం కమిషన్‌ ఎదుట మాజీ ఈఎన్సీ.. గ్రౌటింగ్‌పై దాచడంపై వివరణ

by Ramesh Naini |

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ చేపడుతోన్న కమిషన్‌ విచారణ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

Kaleshwaram : కాళేశ్వరం కమిషన్‌ ఎదుట మాజీ ఈఎన్సీ.. గ్రౌటింగ్‌పై దాచడంపై వివరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ చేపడుతోన్న (Kaleshwaram Inquiry Commission) కమిషన్‌ విచారణ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై జస్టిస్‌ పీ చంద్రఘోష్‌ కమిషన్‌ విచారణ ఏడాది కాలంగా కొనసాగుతోంది. అందులో భాగంగా నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్‌సీ అనిల్ కుమార్‌‌ (ENC Anil Kumar)కు మరోసారి కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో కమిషన్ ఎదుట హాజరయ్యారు. గతంలో ఇచ్చిన తప్పుడు స్టేట్‌మెంట్‌పై ఆయన నుంచి వివరణ తీసుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు గ్రౌటింగ్‌పై ఈఎన్‌సీ వివరణ ఇచ్చారు. బ్యారేజీకు గ్రౌటింగ్ చేసిన విషయాన్ని ఎంక్వైరీలో మాజీ ఈఎన్‌సీ దాచిపెట్టిన విషయాన్ని కమిషన్ గుర్తించిన విషయం తెలిసిందే.

దీంతో ఆయనకు మరోసారి కమిషన్ నోటీసులు ఇచ్చింది. చైర్మన్ పీ చంద్రఘోష్ ముందు ఎలాంటి వివరణ ఇచ్చారో తెలియాల్సి ఉంది. కాగా, ఈ నెలాఖరుకు ఘోష్ కమిషన్ నివేదికను సమర్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అధికారు, ప్రజా ప్రతినిధుల స్టేట్‌మెంట్స్ తీసుకున్న కమిషన్.. డ్రాఫ్ట్ రిపోర్ట్‌ను సిద్దం చేసింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వ కేబినెట్ మినిట్స్ పరిశీలిస్తోంది. ఈ అంశాల ఆధారంగా కమిషన్ పూర్తి నివేదికను ఈ నెల 27 నాటికి నివేదిక ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

Next Story