ఎంగిలి మెతుకులకు ఆశ పడే ఆ కోవర్టుల సంగతి తేలుస్తాం: మధుయాష్కీ గౌడ్ సీరియస్

by Satheesh |   ( Updated:2023-09-04 11:31:25.0  )
ఎంగిలి మెతుకులకు ఆశ పడే ఆ కోవర్టుల సంగతి తేలుస్తాం: మధుయాష్కీ గౌడ్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌కు వ్యతిరేకంగా ఇవాళ గాంధీభవన్‌లో ఫ్లెక్సీలు వెలిసిన విషయం తెలిసిందే. ‘‘ప్యారాచూట్ నాయకులకు ఎల్బీ నగర్ కాంగ్రెస్ టికెట్ ఇవ్వొద్దు.. గో బ్యాక్ టూ నిజామాబాద్.. సేవ్ ఎల్బీ నగర్ కాంగ్రెస్’’ అంటూ రాసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి.

కాగా, ఈ పోస్టర్లపై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ స్పందించారు. గాంధీ భవన్‌లో తనకు వ్యతిరేకంగా వేసిన పోస్టర్ల వెనకాల ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ఒడిపోతాననే భయంతోనే నాపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి సుధీర్ రెడ్డి అని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి ఎంగిలి మెతుకులకు కూడా ఆశ పడే వాళ్ళు ఉంటారని.. అలాంటి వ్యక్తులే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీలో కోవర్టుల సంగతి తెలుస్తామని మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున ఎల్బీ నగర్ సెగ్మెంట్ టికెట్ కోసం మధుయాష్కీ గౌడ్ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధుయాష్కీ గౌడ్ వ్యతిరేకంగా ఏకంగా గాంధీభవన్ గోడలకే పోస్టర్లు దర్శనమివ్వడం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story