- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ సీఎం కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం.. సోదరి కన్నుమూత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి చీటి సకలమ్మ (Sakalamma) (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ (Hyderabad)లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. కేసీఆర్ (కెసిఆర్)కు సకలమ్మ ఐదవ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల (Rajanna Sicilla)జిల్లా ఎల్లారెడ్డిపేట (Yellaredypet) మండలం పెదిర (Pedira) గ్రామం. భర్త హన్మంతరావు (Hanumantha Rao) కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు.
సకలమ్మ మరణ వార్త తెలుసుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఎమ్మెల్సీ కవిత (Kavitha), మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. తొడబుట్టిన సోదరి మృతి చెందినది అని తెలియగానే గులాబీ బాస్ ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, సకలమ్మ (Sakalamma) అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లుగా బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపారు.






