KCR: పార్టీ సీనియర్ నాయకుడి కుటుంబానికి అండగా నిలిచిన కేసీఆర్

by Ramesh Naini |

సుకీర్తి మెడిసిన్ చదవాలనే ఆకాంక్షతో ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న కేసీఆర్, ఆమె విద్యాభ్యాసానికి తన వంతు సహాయాన్ని అందించారు. శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో సుకీర్తికి మెడిసిన్ చదువుకు అవసరమైన ఫీజు చెక్కును కేసీఆర్ అందజేశారు.

KCR: పార్టీ సీనియర్ నాయకుడి కుటుంబానికి అండగా నిలిచిన కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అండగా నిలిచారు. పార్టీ ఆవిర్భావం నుంచే క్రియాశీలకంగా పనిచేసిన జగదీశ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. జగదీశ్ కుమార్తె సుకీర్తి మెడిసిన్ చదవాలనే ఆకాంక్షతో ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న కేసీఆర్, ఆమె విద్యాభ్యాసానికి తన వంతు సహాయాన్ని అందించారు. శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో సుకీర్తికి మెడిసిన్ చదువుకు అవసరమైన ఫీజు చెక్కును కేసీఆర్ అందజేశారు.

మంచిగా చదువుకోవాలి..

ఈ సందర్భంగా సుకీర్తిని ఆశీర్వదించిన కేసీఆర్.. ‘మంచిగా చదువుకుని మంచి వైద్యురాలిగా ఎదగాలి. మీ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది’ అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. కేసీఆర్ చూపిన మానవీయతకు పార్టీ శ్రేణులు, జగదీశ్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story