ఫోన్​ట్యాపింగ్‌లో కీలక సూత్రధారి మాజీ సీఎం​కేసీఆరే: బక్క జాడ్సన్​

by Disha Web Desk 12 |
ఫోన్​ట్యాపింగ్‌లో కీలక సూత్రధారి మాజీ సీఎం​కేసీఆరే: బక్క జాడ్సన్​
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: ఫోన్ ​ట్యాపింగ్ ​వ్యవహారంలో కీలక సూత్రధారి ​మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ​అని ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్​ఆరోపించారు. కేసీఆర్​ కనుసన్నల్లోనే ఫోన్ ​ట్యాపింగుల కోసం ఈ కేసులో అరెస్టయిన ప్రణీత్​ రావు నేతృత్వంలో టీం ఏర్పడిందని పేర్కొంటూ దీనిపై సమగ్ర విచారణ జరపాలని హైదరాబాద్​కమిషనర్​కొత్తకోట శ్రీనివాస్​రెడ్డికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. దీంట్లో ఎస్ఐబీ ఐజీ ప్రభాకర్​రావు, ప్రణీత్​ రావు, శ్రవణ్​కుమార్, శ్రీనిధి ఎండీ జీ.విద్యాసాగర్​రెడ్డి, ఐటీ మేనేజర్​ వేణు ప్రసాద్​ల పాత్ర ఉన్నట్టుగా తనకు సమాచారం ఉందన్నారు. 1980 నేషనల్​సెక్యూరిటీ యాక్ట్ ​ప్రకారం కేసులు నమోదు చేసి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

ప్రణీత్​రావు అతని టీం సభ్యులు వ్యాపారులు, లాయర్ తో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లను ట్యాప్​చేసి పెద్ద ఎత్తున డబ్బు గుంజినట్టుగా వినతి పత్రంలో పేర్కొన్నారు. స్ర్తీ నిధి ఎండీ విద్యాసాగర్​రెడ్డి, ఐటీ మేనేజర్ ​వేణు ప్రసాద్​ కలిసి 30 వేల ట్యాబ్​లు, 5వేల కంప్యూటర్లు, ప్రింటర్లు, వేర్వేరు నెట్​వర్క్​లకు చెందిన 4లక్షల సిమ్ ​కార్డులు, సర్వీస్​ప్రొవైడర్లను సమకూర్చుకుని ఫోన్ ​ట్యాపింగ్​ పైలట్ ​ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. వీటి సహాయంతో స్వయం సహాయక బృందాల నాయకులతోపాటు పలువురు ఉద్యోగుల ఫోన్లను ట్యాప్ ​చేసినట్టుగా పేర్కొన్నారు.

24 గంటల పాటు ఉద్యోగుల ఫోన్లను జీపీఎస్ ​ట్రాకింగ్ లో పెట్టి సేకరించిన సమాచారంతో వారిని బెదిరింపులకు గురి చేశారన్నారు. ఐటీ మేనేజర్​కు సచివాలయంలో ఉద్యోగం రావటంలో ఐటీ ప్రిన్సిపల్​ సెక్రటరీ జయేష్​రంజన్ ​ప్రధాన పాత్ర పోషించారన్నారు. ప్రతిపక్ష పార్టీల్లోని కీలక నాయకుల ఫోన్లను ట్యాప్​ చేశారన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తన నియోజకవర్గంలో ఫోన్ల ట్యాపింగ్​కోసం ఓ సెంటర్​ను ఏర్పాటు చేసుకున్నారన్నారు. దీని కోసం శ్రీనిధి క్రెడిట్​కో ఆపరేటివ్​ నిధులను వాడుకున్నట్టు ఆరోపించారు.

దీనికి స్ర్తీ నిధి ఎండీ విద్యాసాగర్​రెడ్డి, ఐటీ మేనేజర్​వేణుప్రసాద్‌లు సహకరించినట్టుగా తెలిపారు. ఇక, ఐటీ శాఖ మాజీ మంత్రికి అమెరికా, కెనడా, యుకే, సింగపూర్‌తో పాటు మిడిల్​ఈస్ట్​దేశాల్లోని మనీ లాండరింగ్​ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్టుగా పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ హోం మంత్రి, మాజీ ఐటీ మినిస్టర్, పంచాయతీ రాజ్​మంత్రి, ఆయా శాఖల ప్రిన్సిపల్​సెక్రటరీలపై ఎన్ఎస్ఏ యాక్ట్​ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని కోరారు.


Next Story

Most Viewed