పర్సంటేజ్ విధానంపై కమిటీ ఏర్పాటు..తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం

by Prasad Jukanti |

నిర్మాతలు, థియేటర్ ఎగ్జిబిటర్ల పర్సంటేజ్ వివాదంపై సురేష్ బాబు ఆధ్వర్యంలో ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ భేటీ అయింది.

పర్సంటేజ్ విధానంపై కమిటీ ఏర్పాటు..తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు మరియు థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య సమస్య తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో తెలుగు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సంటేజ్ విధానంపై కమిటీ ఏర్పాటు చేసింది. 15 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలకు చోటు కల్పించింది. కమిటీలో ఒక్కో విభాగం నుంచి ఐదుగురుని నియమించారు. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించారు. నిర్మాతలు మరియు థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజ్ వివాదం తలెత్తడంతో ఈ సమస్యల పరిష్కారానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రంగంలోకి దిగింది. ఛాంబర్ అధ్యక్షుడు డి.సురేష్ బాబు ఆధ్వర్యంలో ఇవాళ ఇరు వర్గాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వాడీవేడీగా జరిగిన ఈ సమావేశంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Next Story