- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కలకలం!
by Ramesh Naini |
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. యూనివర్సిటీ హాస్టల్‌లో భోజనం చేసిన అనంతరం దాదాపు 25 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఆహారం కలుషితం కావడంతో విద్యార్థులు డీహైడ్రేషన్, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో యూనివర్సిటీ సిబ్బంది వెంటనే స్పందించి బాధిత విద్యార్థులను చికిత్స నిమిత్తం రాజేంద్రనగర్‌తో పాటు సమీప ప్రాంతాల్లోని పలు ఆస్పత్రులకు తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించడంతో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Next Story






