ఫ్లైట్ మోడ్ సీఎం రేవంత్.. హాఫ్ సెంచరీ కొట్టారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్

by Ramesh Naini |   (  Updated:2025-07-22 11:03:47  IST  )

బీసీ రిజర్వేషన్ల పై రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

ఫ్లైట్ మోడ్ సీఎం రేవంత్.. హాఫ్ సెంచరీ కొట్టారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల పై రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపించారు. ఈ మేరకు ఆమె మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తాజాగా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు మాట్లాతున్న అంశాలను చూసిన కూడా చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ, కౌన్సిల్లో పాస్ చేసి పంపితే.. రాష్ట్రపతి వద్ద పెండింగ్ పెట్టి.. తిరిగి పంపడం లేదన్నారు. పాస్ చేయమని బిల్లుకు మతపరమైన రంగు పులిమే ప్రయత్నం బీజేపీ చేసిందని మండిపడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్‌లో ఎలాంటి రిజర్వేషన్లు ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ ఓట్లు రావని తెలిసే బీజేపీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు బీజేపీ అమలు చేస్తోందని, దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి కోర్టులో ఉందని సాకులు చెప్తోందని ఫైర్ అయ్యారు. బీసీ బిడ్డలకు రిజర్వేషన్లకు దూరంగా ఉంచడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్లైట్ మోడ్ సీఎం అని హాట్ కామెంట్స్ చేశారు. నేడు కూడా ఆయన ఢిల్లీకి పోతున్నారు.. ఇప్పటికే ఢిల్లీకి పోవడంలో హాఫ్ సెంచరీ కొట్టారిన తీవ్ర విమర్శలు చేశారు. ఇన్ని సార్లు ఢిల్లీకి పోయిన బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోడీ (Modi)పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవన్నారు.

పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారని సీఎం వ్యాఖ్యలను గుర్తుకు చేశారు. అయితే బీసీలు పార్టీల పరంగా రిజర్వేషన్లు కోరుకోవడం లేదన్నారు. అన్యాయం జరుగుతుందని వారికి తెలుసన్నారు. అందుకే చట్టబద్దమైన, రాజ్యాంగ బద్దమైన రిజర్వేషన్లు కోరుకుంటున్నట్లు తెలిపారు. 2018 పంచాయతీ రాజ్ చట్టం సవరించి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారో.. తక్షణమే కోర్టులో పిటిషన్ వేసి అర్డినెన్స్ తీసుకురావాలని సూచించారు. బీసీ బిడ్డలకు న్యాయం చేయాలన్నారు. తప్పించుకొని తిరుగుదామని చూస్తే.. రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలకు పోవాలని చూస్తే.. తెలంగాణ బీసీ బిడ్డలు మిమ్మల్ని వదిలిపెట్టరని హెచ్చరించారు.


Also Read: కొండంత పని చేసి..గోరంత కూడా చెప్పుకోలేక‌పోతున్నాం: మంత్రి పొంగులేటి

Next Story