- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: చందునాయక్ హత్యకేసులో నిందితులు అరెస్ట్
రాష్ట్ర సీపీఐ కౌన్సిల్ సభ్యుడు చందూనాయక్ (CPI Chandu Nayak Murder) అలియాస్ చందూ రాథోడ్ (50) హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర సీపీఐ కౌన్సిల్ సభ్యుడు చందూనాయక్ (CPI Chandu Nayak Murder) అలియాస్ చందూ రాథోడ్ (50) హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్యకేసులో మలక్ పేట పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేసి, వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఈ కేసులో శుక్రవారం ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు భాషా, మున్నా, శివ లను అరెస్ట్ చేశారు.
చందునాయక్ ను హత్య చేసింది నలుగురే అయినా.. వారికి మరో ఐదుగురు సహకరించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ప్రధాన నిందితుడైన రాజేష్ తో పాటు ప్రశాంత్, ఏడుకొండలు, సుధాకర్, మున్నా, రాయుడు, రవీంద్రాచారి, యాదిరెడ్డిలను కేసులో నిందితులుగా చేర్చారు. జులై 15న ఉదయం చందునాయక్ శాలివాహన నగర్ పార్కు వద్ద వాకింగ్ చేస్తుండగా నలుగురు దుండగులు అక్కడికి వెళ్లి.. చందు కళ్లలో కారం చల్లి తుపాకీతో ఐదురౌండ్లు కాల్పులు జరిపారు. మూడు బుల్లెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లగా.. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించారు.
చందునాయక్ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు.. వివాహేతర సంబంధంతో పాటు భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలో హత్యకు కారణాలుగా తెలిపారు. సెటిల్ మెంట్స్ చేయని కారణంగానే తన భర్తను చంపారని భార్య కూడా ఆరోపించింది. కాగా.. చందునాయక్ ను చంపేందుకు నిందితులు వారంరోజులు రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.






