- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు.. వ్యక్తి మృతి
తన భార్య కూలి పనులకు వెళ్లడంతో భర్త వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీకైంది.

దిశ, తిరుమలాయపాలెం: తన భార్య కూలి పనులకు వెళ్లడంతో భర్త వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీకైంది. ఒక్క సారిగా మంటలు వ్యాపించి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో చోటుచేకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుధాగాని ప్రసాద్ (38), భార్య సుజిత ఇద్దరు దంపతులు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ప్రసాద్ ప్రైవేట్ ఎలక్ట్రిషన్‌గా పని చేస్తున్నాడు.
ఇటీవల ప్రసాద్ రెండు సార్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఒకే కాలు రెండుసార్లు విరిగింది. వైద్యులు ఆపరేషన్ చేసినప్పటికీ సక్సెస్ కాలేదు. అప్పటి నుంచి ప్రసాద్ ఇంటివద్దే ఉంటున్నాడు. కాగా సోమవారం తన భార్య కూలిపనులకు వెళ్లగా, ప్రసాద్ వంట చేసే క్రమంలో గ్యాస్ సిలిండర్ లీకై, మంటలు వ్యాపించాయి. అయితే మంటలు ప్రసాద్‌కు అంటుకున్నాయి. మంటలకు తీవ్రంగా గాయపడిన ప్రసాద్ అక్కడిక్కడే మరణించాడు. ఈ మేరకు మృతుడి భార్య సుజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






