- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fire Accident: హైవేపై రన్నింగ్ కారులో మంటలు .. పూర్తిగా దగ్దమైన కారు
హైవేపై రన్నింగ్ కారులో మంటలు చేలరేగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) చౌటుప్పల్(Choutuppal) లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: హైవేపై రన్నింగ్ కారులో మంటలు చేలరేగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) చౌటుప్పల్(Choutuppal) లో చోటు చేసుకుంది. ఘటన ప్రకారం హైదారాబాద్- విజయవాడ ప్రధాన రహదారిపై వలిగోండ క్రాస్ రోడ్డు(Valigonda Cross Road) వద్ద హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న ఉన్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు కారును పక్కకు నిలిపి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే మంటలు పూర్తిగా వ్యాపించి కారు మొత్తం దగ్దం అయ్యింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షాట్ సర్క్యూట్ తోనే కారులో మంటలు చెలరేగినట్లు స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.






