సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు.. ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు

by Naga Rani Yarlagadda |

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఓ దంపతులకు జరిగిన మోసం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. అందులో కీలక అంశాలను వెల్లడించారు.

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు.. ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఓ దంపతులకు జరిగిన మోసం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. అందులో కీలక అంశాలను వెల్లడించారు. రాజస్థాన్ కు చెందిన దంపతులు గోవింద్ సింగ్, సోనియా గతేడాది ఆగస్టులో ఐవీఎఫ్ కోసం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో డాక్టర్ నమ్రతను కలిసి విషయం చెప్పారు. సరోగసీకి వెళ్లేందుకు ముందుగా టెస్టుల పేరుతో రూ.66 వేలు తీసుకున్నారు. ఆ తర్వాత వారి స్పెర్మ్, ఎగ్ ను తీసుకుని ప్రొసీజర్ చేస్తామని, మొత్తం రూ.30 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. వాటిలో రూ.15 లక్షలు చెక్కు, రూ.15 లక్షలు క్యాష్ ఇవ్వాలని డీల్ చేసుకున్నారు. సరోగసీ కోసం నమ్రతకు ఆగస్టులోనే రూ.5 లక్షలు ట్రాన్స్ ఫర్ చేయగా.. సెప్టెంబర్ లో వారి స్పెర్మ్, ఎగ్ సేకరించారు.

ఈ ఏడాది మే నెలలో మొత్తం డబ్బును చెల్లించారు. అయితే బిడ్డ పుట్టాక డీఎన్ఏ టెస్టులు చేయాలని కోరగా డాక్టర్ నమ్రత అందుకు నిరాకరించారు. సరోగసీకి అంగీకరించిన మహిళ భర్త మూడున్నర లక్షలు డిమాండ్ చేస్తున్నాడని చెప్పగా.. బాధితులు రూ.2.50 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత వైజాగ్ లో డాక్టర్ కల్యాణి అనే ఆవిడ మీ బిడ్డ అని ఒక శిశువును చూపించారు. ఢిల్లీలో ఆ బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ నిర్వహించగా.. ఆ బిడ్డ తమ డీఎన్ఏతో సరిపోలలేదు. దీంతో తమ బిడ్డ కాదని గ్రహించిన ఆ దంపతులు.. బిడ్డను అసలైన తల్లిదండ్రులకే అప్పగించాలని డాక్టర్ కల్యాణికి తెలిపారు. నమ్రతను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించగా ఆమె రెస్పాండ్ కాలేదు. దీంతో డాక్టర్ నమ్రత, సిబ్బందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ నమ్రతను రిమాండ్ తర్వాత కస్టడీకి తీసుకుని విచారిస్తే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన ఇలాంటి విషయాలు బయటకు రావొచ్చని భావిస్తున్నారు.

Next Story