క్యాబినెట్ విస్తరణపై నేడు తుది నిర్ణయం!

by Ajay Maddhiboyina |

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నట్టుు తెలుస్తోంది. ఈ అంశాలపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో భేటీలో చర్చించారు. ఇక ఈ రోజు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో

క్యాబినెట్ విస్తరణపై నేడు తుది నిర్ణయం!
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నట్టుు తెలుస్తోంది. ఈ అంశాలపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో భేటీలో చర్చించారు. ఇక ఈ రోజు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించనున్నట్టు సమాచారం. ఇక మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఐదుగురు కొత్తవారిని క్యాబినెట్‌లోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఇప్పటికే రెండు నెలల క్రితం మంత్రి వర్గ విస్తరణపై కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ఖర్గేతో రాష్ట్ర నేతలు పలు దఫాలుగా సమావేశం అయ్యారు. ఇప్పుడు సీఎం భేటీ అవ్వడంతో మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా మంత్రివర్గ విస్తరణ మళ్లీ తెరపైకి రావడంతో పలువురి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొందరు తమకే మంత్రి పదవి వస్తోంది అంటూ ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. క్యాబినెట్ లోకి వెళ్లేది వీళ్లే అంటూ ఎక్కువగా వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

Next Story