కొట్లాట మాకు కొత్తేమి కాదు.. KTR ఆసక్తికర ట్వీట్

by Disha Web Desk 4 |
కొట్లాట మాకు కొత్తేమి కాదు.. KTR ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మాకు కొట్లాట కొత్తేమీ కాదు.. గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమం చేసి.. రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. జై తెలంగాణ’ అంటూ ట్వీట్ చేశారు. అయితే నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయించారు. అయితే నిన్నటి బైఠాయించిన ఫోటోలతో పాటు తెలంగాణ ఉద్యమ సమయంలో ఫోటోలను కేటీఆర్ ట్విట్టర్ పోస్ట్‌కు జత చేశారు.

Next Story

Most Viewed