- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్‌ల మధ్య అంతర్గత యుద్ధం.. ఆయనకు ప్రయారిటీ ఇవ్వడమే కారణమా?
తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్‌ల మధ్య అంతర్గత యుద్ధం.. ఆయనకు ప్రయారిటీ ఇవ్వడమే కారణమా?

దిశ, తెలంగాణ బ్యూరో: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న ముగ్గురు ఐఏఎస్ అధికారుల మధ్య కొత్త చిచ్చు రాజేసినట్లు తెలుస్తున్నది. రెండు రోజుల పాటు జరిగిన ఈవెంట్‌లో కేవలం ఒకే అధికారికి ప్రయారిటీ ఇవ్వడంపై మరో ఇద్దరు ఐఏఎస్‌లు జీర్ణించుకోవడం లేదని ప్రచారం జరుగుతున్నది.‘గ్రౌండ్ వర్క్ టైంలో మా సపోర్టు కావాలి.కానీ అసలు ప్రోగ్రామ్ మొత్తం ఆయన చేతిలో పెట్టడం ఏంటీ? ఆయనకే ఎందుకు అంత ప్రయారిటీ?’ అంటూ సదరు బ్యూరోక్రట్స్ ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. ఈ విషయంపై కొందరు సీఎస్ రామకృష్ణరావుకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది.
అప్పుడు ఇప్పుడు ఆయనకే ప్రయారిటీ?
బీఆర్ఎస్ హయాంలో కీలక పదవులను అనుభవించిన ఓ ఐఏఎస్ ఆఫీసరు సీఎం రేవంత్ సర్కారులోనూ కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.ఆ అధికారే సమ్మిట్‌లో ఎక్కువ హడావుడి చేయడాన్ని ఆయన వ్యతిరేక వర్గం ఐఏఎస్‌లకు కంటగింపుగా మారిందని టాక్. కార్యక్రమం ప్రారంభవేడుక నుంచి ముగింపు ప్రొగ్రాం వరకూ ఆయన స్వయంగా ఇన్వాల్వ్ అయ్యారు. దీనితో ఆ ఆఫీసరుకు ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వడం? మిగతా అధికారులకు అవకాశం ఇవ్వొచ్చు కదా? అని ఆయన అంటే గిట్టని అధికారులు మాట్లాడుకుంటున్నారు.“ఆయన కంటే మేం తక్కువ కాదు.మేము కూడా స్పెషల్ సీఎస్‌లమే. గ్రౌండ్ వర్క్ మొత్తం మేము చేయాలి. షో మాత్రం ఆయన చేస్తారా?’ అంటూ తమ సన్నిహితుల వద్ద ఆవేదన చెందినట్లు సెక్రెటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.తన సొంత శాఖ నిర్వహించిన ప్రొగ్రామ్ కూడా ఆయనే హైజాక్ చేశారని ఓ స్పెషల్ సీఎస్ మండిపడుతుండగా మరో స్పెషల్ సీఎస్ మాత్రం 20ఏళ్ల క్రితమే తనకు ప్రపంచ గేమ్స్‌ను నిర్వహించిన అనుభవం ఉందని గుర్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
పంచాయితీ అంతా సీఎస్ పోస్టు కోసమే..
నిజానికి సమ్మిట్ వేదికగా ఓ స్పెషల్ సీఎస్ ఎక్కువగా ఫోకస్ అవడాన్ని ఆయన వ్యతిరేకులు జీర్ణించుకోకపోవడానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ కే.రామకృష్ణరావు పదవీ కాలం మార్చి చివరన పూర్తి కానుంది.ఆ తరువాత ఆ పదవిని దక్కించుకోడానికి ‘గ్లోబల్ సమ్మిట్’లో హడావుడి చేసిన ఓ స్పెషల్ సీఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ఈ ఈవెంట్‌తో తనకు ఆ పదవి పక్కాగా వరిస్తుందనే ధీమాలో ఆయన ఉన్నట్లు ప్రచారం ఉంది.కానీ అదే పోస్టుపై కన్నేసిన మరో స్పెషల్ సీఎస్.. రామకృష్ణరావు తరువాత తనే ఆ చైర్‌లో కూర్చోవాలని టార్గెట్ పెట్టుకున్నారు.అందుకోసం చాలా కాలంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పడేందుకు తీవ్రంగా ప్రయత్నించగా.. చివరికి సర్కారు ప్రయారిటీ స్కీమ్స్ పర్యవేక్షణ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. అలాగే ‘గ్లోబల్ సమ్మిట్’లోనూ కొంత ప్రయారిటీ ఇస్తారని సదరు అధికారి ఆశపడ్డారు.కానీ ముగింపు కార్యక్రమం చివరలో కేవలం 2 నిమిషాల సమయం దొరకడంతో ఆయన నిరాశ చెందినట్టు టాక్ ఉంది.
సీఎస్ పదవి కాలం పొడగింపు?
సీఎస్ పదవి కోసం ఇద్దరు ముగ్గురు స్పెషల్ సీఎస్‌లు ఇప్పట్నుంచే పోటీ పడుతుండగా ప్రస్తుత సీఎస్ రామకృష్ణరావు పదవి కాలాన్ని పొడగించే చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతున్నది. అదే జరిగితే స్పెషల్ సీఎస్‌ల ఆశలు గల్లంతవుతాయి. వాస్తవానికి ఈ ఏడాది అగస్టు చివర్లో రామకృష్ణరావు రిటైర్ కావాల్సి ఉంది. కానీ, కేంద్రం ఆయన పదవి కాలాన్ని మరో 7 నెలలు పాటు(వచ్చే ఏడాది మార్చి వరకు) పొడగించింది. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు కేంద్రంలోని అధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన పదవి కాలాన్ని పొడగిస్తారేమోననే ప్రచారం జరుగుతున్నది.






