- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ వ్యాప్తంగా ఉత్సవాలు.. ఏ జిల్లాలో ఎప్పుడంటే?
తెలంగాణ వ్యాప్తంగా ఉత్సవాలు.. ఏ జిల్లాలో ఎప్పుడంటే?

దిశ, వెబ్‌డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025పై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ వేడుకలు రేపటి నుంచే ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామో ఉత్సవాల ద్వారా తెలియజేస్తున్నామని అన్నారు.
ఉత్సవాల వివరాలు:
= డిసెంబర్ 1న మక్తల్‌లో ప్రారంభం
= డిసెంబర్ 2న కొత్తగూడెం
= డిసెంబర్ 3న హుస్నాబాద్
= డిసెంబర్ 4న ఆదిలాబాద్
= డిసెంబర్ 5న నర్సంపేట
= డిసెంబర్ 6న దేవరకొండ
= డిసెంబర్ 7న ఉస్మానియా యూనివర్సిటీ
= డిసెంబర్ 8న ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ నిర్వహణ
= డిసెంబర్ 9 నుంచి భవిష్యత్ కార్యచరణ వివరణ






