- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ఏడాది మీడియాకు పండగే పండగ.. ప్రభుత్వ ఉగాది వేడుకల్లో సంతోశ్ కుమార్
ఈ ఏడాది ప్రతిరోజు సంచలనాలు నమోదు అవుతాయని ఉగాది పంచాంగ శ్రవణంలో పండితులు వినిపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఏడాది వార్తలు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని మీడియాకు పుష్కలంగా వార్తలు లభిస్తాయని ప్రముఖ పంచాంగ పండితుడు బాచంపల్లి సంతోష్‌కుమార్ (Bachampalli Santhosh Kumar) అన్నారు. రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన ఉగాది వేడుకల్లో బాచంపల్లి సంతోష్‌కుమార్ పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాదిలో వార్తల మీద వార్తలు ప్రతిరోజు సంచలనమే ఉండబోతుందని జోస్యం చెప్పారు. మైకులు దొరికాయి కదా అని చెప్పి ఎక్కువ మాట్లాడవద్దని మౌనం మంచిదని సూచించారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసే నాయకులకు అందరూ పట్టం కడుతారని చెప్పారు.
వారికి పరాభవం తప్పదు:
యూట్యూబుల్లో వ్యూస్ కోసమే, లైక్‍ల కోసమో పిచ్చిపిచ్చి థంబ్ నెయిల్స్ పెడుతూ సనాతధర్మాన్ని ఇబ్బంది పెట్టేవారికి పరాభవం తప్పదని హెచ్చరించారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వంతో తెలుగు రాష్ట్రాలు పోరాటం చేసి నిధులు సాధించుకునే అవకాశం కనిపిస్తోందని తెలిపారు. ఈ ఏడాది పరిపాలన వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యం అధికమవుతాయని తెలిపారు. ఈ సారి దేశారిష్టయోగాలు అధికంగా ఉన్నాయని ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.






