- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా కొరతకు కారణం కాంగ్రెస్ నాయకులే కారణం :రామచందర్ రావు
రాష్ట్రంలో ఎరువుల కొరత కేవలం కాంగ్రెస్ నాయకుల ప్రమేయం తో బ్లాక్ మార్కెట్ కు పోయిందని అందుకే రాష్ట్రం లో రైతులు యూరియా కొరత

దిశ, ప్రతినిధి జోగులాంబ గద్వాల : రాష్ట్రంలో ఎరువుల కొరత కేవలం కాంగ్రెస్ నాయకుల ప్రమేయం తో బ్లాక్ మార్కెట్ కు పోయిందని అందుకే రాష్ట్రం లో రైతులు యూరియా కొరత తో తీవ్ర ఇబ్బందులకు గురైవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు విమర్శించారు. ఆదివారం గద్వాల పట్టణం లోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ తో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ఎక్కువ మంది రైతులు మృత్యువాత పడ్డారని ఆయన ఆరోపించారు.
రైతులకు కావాల్సిన ఎరువులను కృత్రిమంగా కొరత సృష్టించి రాష్ట్రం లోని రైతులను నడిరోడ్డు పై నిలుచ్చేటట్లు చేసారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన ఎరువులు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల కు పైగా అవసరం కాగా కేంద్ర ప్రభుత్వం అదనంగా 12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందించిందని దీనికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు.కాంగ్రెస్ నాయకులు కావాలనే ఎరువులను బ్లాక్ మార్కెట్ కు మరియు ఇతర అవసరాల కోసం యూరియా ను తరలించారాని, దేశం లో ఎక్కడ లేని ఎరువుల కొరత కేవలం తెలంగాణ రాష్ట్రం లోనే ఎందుకు ఉందని ఆయన ప్రభుత్వానికి ప్రశ్నించారు.
స్థానిక ఎన్నికలు వస్తున్నా నేపథ్యంలో రైతులతో ప్రభుత్వానికి వ్యతిరేక భావన వస్తుందని కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బద్నాం చేస్తున్నారన్నారు. గద్వాల జిల్లా లో పత్తి సీడ్ హబ్ గా వున్నదని కానీ ప్రభుత్వం సీడ్ పండించే రైతులకు ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, భరత్ కుమార్, బండల వెంకట్రాములు, అప్సర్ పాషా, జయశ్రీ, రామచంద్ర రెడ్డి, స్నిగ్ద రెడ్డి, శివా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,






