FASTAG E-KYC: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఫాస్టాగ్ ఈ-కేవైసీపై కీలక ప్రకటన

by Disha Web Desk 1 |
FASTAG E-KYC: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఫాస్టాగ్ ఈ-కేవైసీపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఫాస్టాగ్ E-KYC పూర్తి చేసేందుకు మరో నెల రోజుల పాటు గడవును ఫిబ్రవరి-29 నుంచి మార్చి-31 పొడిగిస్తూ.. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణీత సమయం లోపల వాహనదారులు E-KYC పూర్తి చేసుకోవాలని సూచించారు. ఒకవేళ E-KYC పూర్తి చేయని వారి ఫాస్టాగ్ అకౌంట్స్ బ్లాక్‌ లిస్ట్‌లోకి వెళ్లిపోతాయని, మళ్లీ యాక్టివేట్ చేసుకోవాలంటే అదనపు టోల్ ట్యాక్స్ చెల్లించాలని తెలిపారు.

కాగా.. కేంద్ర ప్రభుత్వం జనవరి1, 2021 నుంచి ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది. డిసెంబర్ 1, 2017కు ముందు కన్నా వాహనాలకు ఫాస్టాగ్ ఉండాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఫాస్టాగ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్న ట్యాగ్‌ను వాహానంపై ఉన్న విండ్ షీల్డ్‌పై అతికిస్తారు. టోల్ ప్లాజాలోకి వాహనం వెళ్లగానే ప్లాజాలో ఉన్న RFID రీడర్ దాన్ని స్కాన్ చేసేస్తుంది. ఈ ట్యాగ్ పై ఉన్న ఎకౌంట్ నుంచి టోల్ ట్యాక్స్ కట్ అవుతుంది. గతంలో టోల్ ప్లాజాల వద్ద కొన్ని వందల కొద్ది వాహనాలు వేచి ఉండం వల్ల చాలా ఇంధనం, ప్రయాణికుల సమయం వృథా అయ్యేది. ఫాస్టాగ్ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయి టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గుముఖం పట్టింది.



Next Story

Most Viewed