కేరళ పర్యటనకు రైతు కమిషన్ బృందం

by Muthe.Rajitha |

ఉద్యాన పంటల సాగు, లాభాలపై కేరళ రాష్ట్రంలో అధ్యయనం చేయడానికి అధికారులతో కలిసి రైతు కమిషన్ బృందం గురువారం వెళ్ళింది.

కేరళ పర్యటనకు రైతు కమిషన్ బృందం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యాన పంటల సాగు, లాభాలపై కేరళ రాష్ట్రంలో అధ్యయనం చేయడానికి అధికారులతో కలిసి రైతు కమిషన్ బృందం గురువారం వెళ్ళింది. కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కెవిఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి, మెంబర్ సెక్రెటరీ గోపాల్, వ్యవసాయ , హార్టికల్చర్ అధికారులున్నారు. నేడు కేరళ రాష్ట్రంలోని ప‌ళ‌క్కాడ్ జిల్లాలోని ఎలేవంచేర్రి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న కూర‌గాయ‌ల తోట‌ల‌ను కేరళ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి కమిషన్ బృందం పరిశీలిస్తుంది.

గ‌త కొన్నేళ్లుగా కూర‌గాయ‌ల సాగుతో కేరళ రైతులు ఆర్ధికంగా లాభాలు పొందుతున్నారు. కూరగాయల తోటలతో సాధిస్తున్న విజయాలపై అక్కడి రైతులను అడిగితెలుసుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించి ఈనెల 15న హైదరాబాద్ కు తిరుగు పయానమైతారు.

Next Story