Harish Rao : కాంగ్రెస్ మోసాలతోనే రైతు ఆత్మహత్యలు : హరీష్ రావు

by Y. Venkata Narasimha Reddy |

రుణమాఫీ అని మభ్య పెట్టి..500 బోనస్ అని మోసం చేసి..పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే రైతన్నలు ఆత్మహత్య(Farmers' Suicides)లు చేసుకుంటున్నారని..కాంగ్రెస్ పాలన(Congress Government) రైతులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) విమర్శించారు. 24 గంటలు గడవకముందే రుణభారంతో ఆదిలాబాద్‌లో మరో రైతు రాథోడ్ గోకుల్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

Harish Rao : కాంగ్రెస్ మోసాలతోనే రైతు ఆత్మహత్యలు : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : రుణమాఫీ అని మభ్య పెట్టి..500 బోనస్ అని మోసం చేసి..పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే రైతన్నలు ఆత్మహత్య(Farmers' Suicides)లు చేసుకుంటున్నారని..కాంగ్రెస్ పాలన(Congress Government) రైతులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) విమర్శించారు. 24 గంటలు గడవకముందే రుణభారంతో ఆదిలాబాద్‌లో మరో రైతు రాథోడ్ గోకుల్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ పూర్తి చేశామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బ్యాంకుల వేధింపులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల చావులు కనిపించడం లేదా? అని హరీష్ రావు ప్రశ్నించారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్న ఉసురు ఎందుకు తీస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని, అందుకే మీరే బాధ్యత వహించాలిని డిమాండ్ చేశారు. రైతులకు భరోసా కల్పించడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని, వరుసగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతులు దేశానికి వెన్నెముక..అలాంటి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది కాంగ్రెస్ సర్కార్ అని విమర్శించారు. మీ ఏడాది పాలనలో ఇప్పటి వరకు 𝟒𝟎𝟐 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దుర్మార్గమన్నారు. కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చితే, రేవంత్ రెడ్డి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టాడని విమర్శించారు.

గతంలో రుణమాఫీ కాలేదని, అదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియజేస్తున్న రైతులను అరెస్టు చేసి, పోలీస్ యాక్ట్ (30 Act) పేరుతో జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారని..ప్రశ్నించే గొంతులను అణగదొక్కారని దుయ్యబట్టారు. రుణమాఫీ జరగకపోవడంతో రైతులు కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ విసిగి పోతున్నారని.. ఉన్న భూములు కుదవ పెట్టి అప్పులు తెస్తున్నారని మండిపడ్డారు. ఆ అప్పులు చెల్లించలేక చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.

ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదన్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు పూర్తిగా మరిచిపోయినట్లున్నారన్నారు. రైతు సోదరులారా దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండని..ఆత్మహత్యలు పరిష్కారం కాదని.బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా అందరికీ రుణమాఫీ, రైతు భరోసా, అన్ని పంటలకు 500 బోనస్ హామీలు అమలు చేసే దాకా నిలదీస్తూనే ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు.

Next Story