- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రైతులా మజాకా.. లంచం అడిగిన అధికారికి ఈ రేంజ్ ట్విస్ట్ ఎవరూ ఇచ్చి ఉండరు!
తెలంగాణలో లంచం అడిగిన ప్రభుత్వ అధికారికి ఓ రైతు(Farmer) సరైన విధంగా బుద్ధి చెప్పాడు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లంచం అడిగిన ప్రభుత్వ అధికారికి ఓ రైతు(Farmer) సరైన విధంగా బుద్ధి చెప్పాడు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన రైతు తన పాస్ బుక్‌లో భూ పట్టా పేరు మార్చడానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అయితే.. రైతు అమాయకత్వాన్ని అదునుగా భావించిన ఎమ్మార్వో(MRO) లంచం డిమాండ్ చేశాడు. చేసేదేం లేక లంచం ఇవ్వడానికి రైతు రెడీ అయ్యాడు. కానీ.. సదరు అధికారి మరోసారి ఎవరినీ లంచం అడగకుండా బుద్ధి చెప్పాలని కూడా డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే లంచం ఎమ్మార్వోకు లంచం ఇస్తూ.. చాకచక్యంగా వీడియో తీశాడు. రైతు వీడియో రికార్డ్ చేస్తున్నాడని తెలియక రూ.7 వేలే ఇస్తావా, ఇంకో వెయ్యి రూపాయలు ఇవ్వు అంటూ అడగటం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో జిల్లాలో వైరల్‌గా మారింది. రైతులు, ప్రజలే కాకుండా అధికారులు సదరు రైతును ప్రశంసిస్తున్నారు. వీడియో






