- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ విత్తనాలతో నష్టం జరిగితే చట్టాలు వినియోగించుకోవాలి: రైతు కమిషన్సభ్యులు సునీల్
నాణ్యమైన విత్తనం రైతు హక్కు అని కానీ, ప్రతి పంట కాలంలో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతున్నారని రైతు కమిషన్సభ్యులు భూమీ సునీల్పేర్కొన్నారు. విత్తన నాణ్యతలో లోపంతో కొనుగోలు చేసిన విత్తనం మొలకెత్తక, ఆశించిన దిగుబడి రాక ఏటా వేలమంది రైతులు నష్టపోతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నాణ్యమైన విత్తనం రైతు హక్కు అని కానీ, ప్రతి పంట కాలంలో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతున్నారని రైతు కమిషన్సభ్యులు భూమీ సునీల్పేర్కొన్నారు. విత్తన నాణ్యతలో లోపంతో కొనుగోలు చేసిన విత్తనం మొలకెత్తక, ఆశించిన దిగుబడి రాక ఏటా వేలమంది రైతులు నష్టపోతున్నారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ విత్తనాలకు సంబంధించి చట్టాలు ఉన్నాయని నష్ట పరిహారం రైతులు పొందేందుకు పలు మార్గాలు ఉన్నాయని, వాటి కోసం రైతులు ఏమి చేయాలనే అంశాలను వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి చేసిన విత్తనాలు, మొలకల చట్టం,1951 కాగా, విత్తనాల చట్టం1966, కొత్త వంగడాల రక్షణ, రైతు హక్కుల చట్టం 2001, పత్తి విత్తనాల చట్టం 2007 ఉందని తెలిపారు.
అదే విధంగా నాణ్యత లేని విత్తనాలతో నష్టం జరిగితే నష్టపరిహారం పొందవచ్చని వినియోగదారుల చట్టం క్రింద జిల్లా వినియోగదారుల ఫోరమ్ లో కేసు వేయవచ్చని, దీంతో పాటు సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసేందుకు వీలుందన్నారు. పత్తి విత్తనాల చట్టం క్రింద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు. రిజిస్టర్ అయినా కొత్త వంగడాలలో నాణ్యతా లోపం అయితే రైతు హక్కుల చట్టం క్రింద కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చని తెలిపారు. నష్టపరిహారం విషయంలో విత్తనాల కోసం చెల్లించిన ధర, సాగు ఖర్చు, తగ్గిన దిగుబడి విలువ , కలిగిన మానసిక క్షోభకు పరిహారం లభిస్తుందన్నారు. రైతులు నష్టపరిహారం పొందాలంటే ముందుగా విత్తనాలు కొన్నపుడు రసీదు తప్పక తీసుకోవాలి. విత్తనాలు ఉంచిన డబ్బా, సంచి దాచి ఉంచాలి. విత్తనాల గురించి సమాచారం తెలుపుతు ఇచ్చిన కాగితాలను దాచి ఉంచాలి. వీలైతే కొన్ని విత్తనాలను కూడా భద్రపరచాలి పంట నష్టం జరిగిన వెంటనే వ్యవసాయ అధికారికి, సంబంధిత డీలర్, కంపెనీ ప్రతినిధికి తెలిపాలి. నష్ట పరిహారం కోసం కేసు దరఖాస్తు పెట్టాలని సూచించారు.






