- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ సమ్మిట్‌లో ఫ్యాక్ట్ vs ఫిక్షన్ అంశంపై చర్చ.. MP మల్లు రవి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని హెచ్‌సీసీలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న భారత్ సమ్మిట్(Bharat Summit) 2025లో ఫ్యాక్ట్ vs ఫిక్షన్(Fact vs Fiction) అంశంపై కీలక చర్చ జరిపారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని హెచ్‌సీసీలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న భారత్ సమ్మిట్(Bharat Summit) 2025లో ఫ్యాక్ట్ vs ఫిక్షన్(Fact vs Fiction) అంశంపై కీలక చర్చ జరిపారు. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి(Mallu Ravi) మాట్లాడుతూ.. తప్పుడు సమాచారం సమాజాంలో అశాంతికి కారణం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఒక హక్కుగా డిజిటల్ లిటరసీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మన యువతను ఫాక్ట్ చెకర్‌లాగా మలచాలని అన్నారు. గ్రామ స్థాయిలో ట్రూత్ కమిటీలు వేయాలని కోరారు.
సచ్ బతావో - దేశ్‌కో నినాదంతో జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని అన్నారు. ఏదైనా సమాచారం షేర్ చేసేముందు ఆలోచించు అనే సందేశం ఇస్తాం.. బాధ్యతాయుతమైన మీడియాను బలపరుస్తామని ప్రకటించారు. స్వతంత్ర జర్నలిజాన్ని తామేప్పుడూ తప్పుబట్టబోమని.. సమర్థించడానికే ప్రయత్నిస్తామని అన్నారు. ఐటీరంగంలో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గదామమని తెలిపారు. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భారత్ సమ్మిట్ చారిత్రాత్మకమైనదని అన్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలతో భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమ్మిట్‌లో ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. సోషల్ జస్టిస్, శాంతి తదితర అంశాలపై చర్చించారు.






