- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనదారులకు బిగ్ అలర్ట్.. ముగుస్తున్న భారీ డిస్కౌంట్ గడువు
ధీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్చలాన్లను క్లియర్చేయటానికి పోలీసు శాఖ ప్రకటించిన డిస్కౌంట్ఆఫర్ఈనెల 31వ తేదీతో ముగియనుంది.

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ధీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్చలాన్లను క్లియర్చేయటానికి పోలీసు శాఖ ప్రకటించిన డిస్కౌంట్ఆఫర్ఈనెల 31వ తేదీతో ముగియనుంది. ఆ తరువాత గడువు పెంచేది లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా రాష్ర్టంలో 3.5 కోట్లకు పైగా ట్రాఫిక్చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు ఈనెల 1వ తేదీన డిస్కౌంట్ఆఫర్ను ప్రకటించారు. జనవరి 10వ తేదీ వరకు ఈ ఆఫర్ఉంటుందని ప్రకటించారు.
ఈ క్రమంలో మొదటి పది రోజుల్లోనే ప్రభుత్వ ఖజానాకు 135 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వాహనదారుల నుంచి భారీ ఎత్తున స్పందన రావటంతో పోలీసు ఉన్నతాధికారులు డిస్కౌంట్ఆఫర్ను ఈ నెలాఖరు వరకు పొడిగించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాకు మరో 20 కోట్ల రూపాయలు సమకూరాయని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈనెల 31వ తేదీతో డిస్కౌంట్ఆఫర్ముగుస్తోందని, ఈలోపు దానిని సద్వినియోగం చేసుకోవాలని వాహనదారులకు సూచించారు.






