బ్యారేజీల పునరుద్ధరణకు నిపుణుల కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా ఏబీ పాండ్య నియామకం

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-28 09:10:35  IST  )

కాళేశ్వరం (Kaleshwaram)తో పాటు అనుబంధ ప్రాజెక్టులైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో తెలంగాణ సర్కార్ (Telangana Government) కీలక అడుగు వేసింది.

బ్యారేజీల పునరుద్ధరణకు నిపుణుల కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా ఏబీ పాండ్య నియామకం
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం (Kaleshwaram)తో పాటు అనుబంధ ప్రాజెక్టులైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో తెలంగాణ సర్కార్ (Telangana Government) కీలక అడుగు వేసింది. ఈ మేరకు బ్యారేజీల పునరుద్ధరణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కమిటీకి చైర్మన్‌గా నీటి పారుదల రంగంలో అనుభవజ్ఞుడు, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్య (AB Pandya)ను నియమించింది. అయితే, కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులకు చోటు కల్పించగా.. అందులో ఇద్దరు గెస్ట్ ఎక్స్‌పర్ట్స్ కూడా ఆన్నారు.

నిపుణుల కమిటీలో చైర్మన్ ఏబీ పాండ్యతో పాటు ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్, ఈఎన్సీ ఓ అండ్ ఎం శ్రీనివాస్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ ప్రశాంత్ చంద్ర, సీఈ రామగుండం, రిటైర్డ్ సీఈ సత్యనారాయణ, హైడ్రాలిక్ ఎక్స్‌పర్ట్ సతీష్, జియో టెక్నికల్ ఎక్స్‌పర్ట్ రమణ మూర్తితో పాటు మరొకరు ఉన్నారు. ఈ కమిటీ ప్రధానంగా కేంద్ర జల సంఘం, పుణె (Pune)లోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ (CWPRS) ఇచ్చే సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై కసరత్తు చేయనుంది. అదేవిధంగా బ్యారేజీలకు చేయాల్సిన సాంకేతిక పరీక్షలపై సూచలను చేయనుంది. ఎన్డీఎస్‌ఏ (NDSA) ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాజెక్టుల పునరుద్ధరణపై నీటి పారుదల శాఖ ఈఎన్సీ కార్యాలయం ఓ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసి ఇప్పటికే ప్రభుత్వానికి హ్యాండోవర్ చేసింది.

Next Story