- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Municipal Elections: ఎగ్జిట్ పోల్స్‌లో ఆ పార్టీదే హవా
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల(Telangana Municipal Elections) పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్‌కు సమయం ఉండగా.. క్యూలో ఉన్నవారికి 5 గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. పోలింగ్ సరళి ముగియడంతో ఎగ్జిట్ పోల్స్(Municipal Election Exit Polls) ఫలితాలు వెలువడుతున్నాయి. 7 కార్పొరేషన్లలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెంను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. నిజామాబాద్, కరీంనగర్‌ను బీజేపీ దక్కించుకుంటుందని, బీఆర్ఎస్ ఒక్క కార్పొరేషన్‌నూ సొంతం చేసుకోలేదని పేర్కొంది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 68-76, బీఆర్ఎస్ 29-36, బీజేపీ 3-5, ఎంఐఎం 0-1, ఇతరులు 8-14 దక్కించుకుంటారని పేర్కొంది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 13న ఉదయం 8 గంటలకు 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.






