- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రవ్యాప్తంగా కల్లు కంపౌండ్‌లపై ఎక్సైజ్ దాడులు
తెలంగాణ వ్యాప్తంగా కల్లు కంపౌండ్‌లపై ఎక్సైజ్ శాఖ(Excise Department) దాడులు నిర్వహిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా కల్లు కంపౌండ్‌లపై ఎక్సైజ్ శాఖ(Excise Department) దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కల్లు తయారీ, కల్తీ కల్లు విక్రయాలను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కల్లు కంపౌండ్‌లపై దాడులు నిర్వహించి, అనుమతులు లేని కల్లు తయారీ కేంద్రాలను సీజ్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ఇదివరకే మూడు అక్రమ కల్లు కంపౌండ్‌లపై కేసులు నమోదు చేయగా.. తాజాగా ముషీరాబాద్‌లో అనుమతులు లేని ఒక కల్లు కంపౌండ్‌ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.
ఈ దాడుల్లో అక్రమంగా తయారు చేసిన కల్లు, జాగరీ వాష్, ఇతర సామగ్రిని, పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్టేట్ టాస్క్ ఫోర్స్ (STF), డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ (DTF) బృందాల సమన్వయంతో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, శంషాబాద్ వంటి ప్రాంతాల్లో తనిఖీలు తనిఖీలు కొనసాగుతున్నాయి.






