- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యథేచ్ఛగా అల్పాజోలం అక్రమ రవాణా.. కట్టడి చేయడంలో ‘ఎక్సైజ్’ విఫలం
కల్లు కల్తీని అడ్డుకోవడంలో ఎక్సైజ్ శాఖ విఫలమైనట్టు చర్చజరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: కల్లు కల్తీని అడ్డుకోవడంలో ఎక్సైజ్ శాఖ విఫలమైనట్టు చర్చజరుగుతున్నది. కల్తీ కల్లు తాగి పలువురు మణించినా.. ఇప్పటికీ మృతుల సంఖ్యను ప్రకటించకపోవడం చర్చకు దారితీస్తున్నది. అంతేకాకుండా ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఒక సీఐను సస్పెన్షన్ చేసినా.. అధికారికంగా ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కల్లును కల్తీ చేయడానికి వినియోగించే అల్ప్రాజోలంను అడ్డుకోలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
అల్ప్రాజోలంతోనే కల్తీయథేచ్ఛగా అల్ఫ్రాజోలం అక్రమ రవాణా.. కట్టడి చేయడంలో ‘ఎక్సైజ్’ విఫలంకల్లును కల్తీ చేయడానికి ముఖ్యంగా అల్ప్రాజోలంను వాడుతారు. ఈ అల్ప్రాజోలం ఇప్పుడు ట్యాబ్లెట్ల రూపంలో కూడా లభిస్తున్నది. అల్ప్రాజోలం తయారీకి ముడి సరుకును ఢిల్లీ, కర్ణాటక, ఒడిశా, ఏపీ రాష్ర్టాలనుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే అల్ప్రాజోలం రవాణాను ఎక్సైజ్ శాఖ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. అందుకే కల్లు కల్తీని అడ్డుకోలేకపోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అధికారిక ప్రకటనలు కరువు
బాలానగర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జరిగిన కల్తీ కల్లు ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మరణించినట్లు తెలిసింది. అయితే ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదని, 28 మంది అస్వస్థతకు గురయ్యారని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫొర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం జులై 9న పత్రికా ప్రకటన విడుదల చేశారు. బాధితులను నిమ్స్ లో పరామర్శించినట్లు వెల్లడించారు. కానీ అప్పటికే ఆరుగురు మరణించినట్లు మరణించిన వారి బంధువులు తెలిపారు. అసలు కల్తీ కల్లు ఘటనలో ఇప్పటి వరకు ఎందరు మృతి చెందారు? ఎంత మంది అస్వస్థతకు గురయ్యారు? అనే స్పష్టత ఎక్సైజ్ శాఖ వద్ద కనిపించడం లేదు. కూకట్ పల్లి ఘటన తర్వాత కుత్బుల్లాపూర్ లో సైతం మరో ఘటన చోటుచేసుకున్నది. కల్తీ కల్లు సేవించి ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు కల్తీ కల్లు ఘటనకు బాధ్యులను చేస్తూ ఎక్సైజ్ శాఖ కూటపల్లి ఎస్ హెచ్ వోను సస్పెండ్ చేసినట్లు చెబుతున్నారు. అయితే దీనికిసంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.
మొక్కుబడిగా దాడులు, అరెస్టులు
కల్తీ కల్లు ఘటన తర్వాత కల్లు డిపోలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. అరెస్టులు చేశారు. అయితే కల్తీ కల్లు ఘటనపై ఇప్పటి వరకు మీడియా సమావేశం మాత్రం నిర్వహించలేదు. ఘటనకు గల కారణాలు బహిరంగంగా వెల్లడించలేదు. మరణించిన కుటంబాలకు ఎక్సయిజ్ శాఖ తరపున న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన దాఖలాలు సైతం లేవు.






