నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న స్థలాల పరిశీలన!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-24 16:43:56  IST  )

గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా అందిస్తున్న తీరుపై దక్షిణ తెలంగాణ విద్యుత్​ పంపిణీ శాఖ సీఎండీ ముషారఫ్​ ఫరూఖీ గురువారం రాజధాని

నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న స్థలాల పరిశీలన!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా అందిస్తున్న తీరుపై దక్షిణ తెలంగాణ విద్యుత్​ పంపిణీ శాఖ సీఎండీ ముషారఫ్​ ఫరూఖీ గురువారం రాజధాని హైదరాబాద్​లోని పలు చోట్ల క్షేత్రస్థాయి తనిఖీలు చేశారు. బంజరాహిల్స్​, జూబ్లీహిల్స్ , ఖైరతాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలను ఆయన పర్యటించి వినియోగదారులతో మాట్లాడారు. నగరంలోని కొన్ని చోట్ల విద్యుత్​ మరమ్మతుల పేరిట సిబ్బంది తరుచు కోత విధిస్తూ పనులు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

ఒక్కో సారి రాత్రి వేళల్లోనూ విద్యుత్ ​అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ డాక్టర్ నరసింహులు, చీఫ్ ఇంజనీర్ మెట్రో జోన్ సాయిబాబా, హైదరాబాద్ సెంట్రల్ ఎస్​ఈ వెంకన్న, మెహిదీపట్నం డీఈ సుధీర్ కుమార్ ఇతర అధికారులు ఆయా ప్రాంతాలను సందర్శించి వినియోగదారులతో మాట్లాడారు. కాగా నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న స్థలాల సీఎండీ ముషారఫ్​ఫరూఖీ తదితరులు పరిశీలించారు.

Next Story