- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: పదో తరగతి పరీక్షల్లో భారీ నిర్లక్ష్యం!.. 80 మంది విద్యార్థులకు సేమ్ స్కూల్‍లో సెంటర్
కూకట్‌పల్లి న్యూ ఎరా స్కూల్ విద్యార్థులకు సేమ్ స్కూల్ ఎగ్జామ్ సెంటర్ గా కేటాయించడం వివాదాస్పదం అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పదో తరగతి పరీక్షలు (Telangana SSC Exams) ప్రారంభమయ్యాయి. అయితే పరీక్షల నిర్వహణలో మరోసారి విద్యాశాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకే స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు అదే స్కూల్‍లో ఎగ్జామ్ సెంటర్ కేటాయించడం (Self Center Controversy) ఇప్పుడు పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కూకట్‍పల్లిలోని న్యూ ఎరా స్కూల్‍లో (Kukatpally New Era School) చదువుతున్న 80 మంది విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్‍గా అదే స్కూల్‍ను అధికారులు కేటాయించారు.ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రానికి వెళ్తున్న విద్యార్థులకు హాల్ టికెట్ ఎవరికూ చూపెట్టవద్దని స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. పరీక్ష హాల్ టికెట్లు పది రోజుల క్రితమే విద్యాశాఖ అధికారులు జారీ చేసినా ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా జిల్లా విద్యాధికారి రహస్యంగా ఉంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులకు సెల్ఫ్ సెంటర్ కేటాయించడం వెనుక మార్కుల కోసం అధికారులు, స్కూల్ యాజమాన్యాలు కుమ్మక్కు అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.






